మనీ: ఇంట్లో డబ్బు నిలవడం లేదా..? ఈ తప్పు చేస్తున్నారా..?

Divya
కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలువకుండా బయటకు వెళ్ళిపోతుంది అట.. కొంతమంది కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఇంట్లో చేసే అలవాటులో పొరపాటు కారణంగా లక్ష్మీదేవి ఇంట్లో నుంచీ మనకు తెలియకుండానే వెళ్లి పోతుందట. అయితే ఇప్పుడు మీరు కూడా ఇలాంటి కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారా..?అయితే ఇంట్లో డబ్బు నిల్వదట..ఇక ఆ పనులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ప్రతి ఒక్క గృహిణి నిద్ర లేచిన వెంటనే చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం.. ఇక ప్రతి ఒక్కరు చీపురును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.ఈ చీపురు తో ఇల్లంతా ఒక సారి శుభ్రం చేసిన తర్వాత,  ఆ చీపుర్లు తీసుకెళ్లి ఒక మూలన పెడుతూ ఉంటారు.. ఇలా చేయడం వల్ల కొన్ని విషయాలపై ఇంట్లో చాలా ప్రభావం చూపిస్తాయి. ఇక సాధారణంగా చీపురు ను పట్టుకునే బాగా నేలకానించి , కుచ్చు భాగం నేలకు రానివ్వకుండా పైకి ఉండేలా పెడుతూ ఉంటారు. కానీ నిజానికి చీపురుకట్టను మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఎలా అయితే పట్టుకుంటారో, అలాగే పెట్టాలట. చీపురుకట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లు అని చెబుతున్నారు పండితులు.

ఈశాన్యం , ఆగ్నేయం  వైపు మాత్రం చీపురును పెట్టకూడదు. నైరుతి, వాయువ్య మూల అది కూడా ఎవరికీ కనిపించకుండా మాత్రమే చీపురు పెట్టాలి.. చీపురు పట్టుకొని ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఓం శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే శనీశ్వరుడు బయటకు వెళ్ళిపోతాడు. చీపురు, చాట ఒకేచోట పెట్టకూడదట. ఇక మంగళవారం,శుక్రవారం చీపురు లను కొనుగోలు చేయకూడదు. పాడైపోయిన  చీపుర్లు ఉంటే సోమవారం, ఆదివారం, బుధవారం, గురువారం సమయాలలో మాత్రమే బయటపడి వేయాలి. ఎవరైనా చనిపోయిన తర్వాత భౌతిక కాయం ఉన్న చోట చీపురు తో ఉడ్చితే , ఆ చీపురు పడేయాలి. బిడ్డ పుట్టిన తరువాత పురిటి స్నానం చేసి,ఆ రోజు నుంచి ఆ ఇంటిలో కొత్త చీపురులను మాత్రమే ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: