ఈ 5 టిప్స్ తో మీ జీవితం డబ్బు మయం...

VAMSI
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు. మరి కొందరు వారి దగ్గర ఉన్న కొద్ది మొత్తం డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తే అధిక డబ్బును పొందగలం అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు అందరూ మనం సరైన పద్ధతుల ద్వారా మన దగ్గరున్న డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు జాగ్రత్తగా ఉండడంతో భవిష్యత్తులో ఎటువంటి ఆర్ధిక పరిస్థితులు వచ్చినా భరోసాగా ఉండవచ్చు. మరి అవేమిటో ఒకసారి తెలుసుకుందామా.
1. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్
గత రెండు సంవత్సరాల నుండి మన జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్న కరోనా వైరస్  కారణంగా జీవితంపై భద్రత కలిగి ఉండడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసి వచ్చింది. అంతే కాకుండా జీవితంలో ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించి భద్రత అవసరం అని అర్థమయింది. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బుతో మీ కుటుంబం మొత్తానికి జీవిత భీమా ను తీసుకోవడం ఎంతో ఉత్తమం. అయితే మీరు పాలసీ తీసుకునే ముందు ఎక్కువ ప్రీమియం ఉండేది కాకుండా, ప్రీమియం తక్కువ ఉండే పాలసీని తీసుకోవడం మంచిది.
2. హెల్త్ ఇన్సూరెన్స్
ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు తరచూ ఎదో ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఓకె కానీ ప్రాణాంతకమైన కిడ్నీలో రాళ్ళు, హృదయ సంబంధిత వ్యాధులు, గ్లకోమా లాంటి వాటికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఒక్కసారిగా అంత ఖర్చు పెట్టలంటే ఎంత ఇబ్బందో మనకు తెలిసిందే.  అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు పెద్ద పెద్ద జబ్బులు బారిన పడినా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
3 . పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
మీ దగ్గర ఉన్న డబ్బును సవే చేయడానికి ఉన్న మరొక మార్గం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను ఓపెన్ చేయడం. దీని ద్వారా 7.1 శాతం వడ్డీ మీకు వస్తుంది. మీకు ప్రతి సంవత్సరం ఇన్కం టాక్స్ వేసే సమయంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ లో మీరు ఒక సంవత్సరానికి 500 రూపాయల నుండి 1.5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది.  ఈ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు ఉంది. ఈ పీరియడ్ అయిన తరువాత అందులో ఉన్న మొత్తం అమౌంట్ ను డ్రా చేసుకోవచ్చు. లేదు అదే అకౌంట్ ను మొత్తానికి పిపీఎఫ్ కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతిగా తెలుస్తోంది.
4. ఇంటిని కొనడం
ఇప్పుడు పట్టణాలలో జీవించే చాలా మంది అద్దె ఇంటిలోనే అంటున్నారు. కానీ ఈ పద్దతి నుండి బయటకు వచ్చే ఆలోచన ఎప్పటికీ చేయరు కొందరు. బ్యాంక్ లోన్ సహాయంతో ఒక చిన్న ఇంటిని కొనండి.  మీరు ఆ ఇంటిలో ఉన్నా పర్లేదు లేదా ఎవరికి అయినా అద్దెకు ఇచ్చినా పర్లేదు. దీని వలన మీరు లోన్ సక్రమంగా కట్టుకుంటూ మంచి సిబిల్ స్కోర్ ను మెయింటైన్ చేయడం కాకుండా, మీరు చాలా సులభంగా ఇంటిని సొంతం చేసుకుంటారు. అంటే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కూడా ఉపయోగించుకోండి.
5.పెట్టుబడి పెట్టడం
మీరు తెలివిగా ఆలోచిస్తే ప్రతి దానిలో పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి. కొంత కాలం వరకు ఏ సమయాల్లో ఏ విధంగా షేర్స్ మారుతున్నాయి అని అన్ని విధాలుగా ట్రైన్ కండి. తర్వాత చిన్న విలువ కలిగిన వాటిపై ఇన్వెష్ట్ చేయండి. మొదటగా పెద్ద మొత్తాల్లో ఇన్వెష్ట్ చేయొద్దు. మీకు తెలియని సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ లేదా తెలిసిన వాటి ద్వారా కానీ అవసరమయిన సమాచారాన్ని తెలుసుకుంటూ చాలా తెలివిగా వ్యవహరించండి.
ఈ అయిదు టిప్స్ మీకు మనీ పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాము.
 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: