మనీ: ఈ పాలసీ కేవలం అమ్మాయిలకు మాత్రమే..!

Divya
భారత దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం వినూత్న ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అమలు చేస్తూ, కస్టమర్లను ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇప్పటివరకు మహిళలకు ,వృద్ధులకు, రిటైర్డ్ ఆఫీసర్లకు సరికొత్త పథకాలను అమలు చేసిన ఎల్ఐసి, ఇప్పుడు మరోసారి వినూత్నంగా ఆలోచన చేసింది..అదేమిటంటే కేవలం బాలికల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది.. అదేమిటో దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్ఐసి ప్రవేశపెట్టిన కన్యాదాన్ పాలసీ.. చేరినట్లు  అయితే తండ్రి తన కూతురికి ఇవ్వాల్సిన కట్నం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు నిపుణులు. ప్రత్యేకంగా అమ్మాయిల పెళ్లిళ్ల కోసమే ఈ పథకాన్ని డిజైన్ చేశారట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కన్యాదాన్  పేరుతో ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులను, పెట్టుబడి పెట్టే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ విధంగా ఒక జీవన లక్ష్యా ను ఎల్ఐసి కన్యాదాన్  అనే ట్యాగ్ లైన్ తో ఏర్పాటు చేసింది. ఈ కాలంలో ఆడ పిల్లల పెళ్లి అంటే లక్షలు, కోట్లలోనే ఉంటుంది.. కాబట్టి ఈ పథకం గురించి ఒకసారి తెలుసుకుందాం.
ఎవరైనా ఈ పథకంలో చేరాలనుకుంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి ఒకవేళ ఆడపిల్లల కోసం అయితే ఒక సంవత్సరం వయసు ఉంటే సరిపోతుంది. ఎన్నారైలు కూడా ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఈ పథకం లో పది లక్షల రూపాయలను కింద ఎంచుకున్నట్లు అయితే 13 సంవత్సరాల తర్వాత సుమారుగా 25 లక్షలు రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇక మరికొన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం, సమీపంలో ఉన్న ఎల్ఐసి ప్రతినిధులను సంప్రదిస్తే మీకు కావాల్సిన అన్ని వివరాలను వారు వెల్లడిస్తారు.. మరింకెందుకాలస్యం మీకు కూడా ఆడపిల్లలు ఉన్నట్లయితే వెంటనే ఈ పథకంలో చేరండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: