మనీ : వారికి శుభవార్త తెలిపిన జగన్ ప్రభుత్వం ..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అట్టడుగు వర్గాల వారికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు కుల , మత అని తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇక అంతే కాదు తన మేనిఫెస్టోలో రాసుకున్న నవరత్నాలను కూడా చెప్పిన సమయం కంటే ముందుగానే తీరుస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు కూడా ఒక శుభవార్త ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం.. అదేమిటో ఇప్పుడు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకుందాం..
ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు అనే కాన్సెప్ట్ ని మొదలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి , తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎవరైతే జగనన్న కాలనీలో తమ కళలకు తగ్గట్టుగా ఇంటి నిర్మించుకోవాలి అని అనుకుంటున్నారో , అలాంటివారికి పావలా వడ్డీ పై బ్యాంకులు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఈ విషయాన్ని బ్యాంకు అధికారులతో మాట్లాడినట్లు సీఎం అధికారులు వెల్లడించారు.
నిన్న అనగా బుధవారం ఉన్నతాధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన స్పందన అనే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారట. ఇప్పటికే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసి , రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు . అంతేకాదు ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో వుండి,  డబ్బు కావాలంటే ఇళ్ల పట్టాలపై కూడా రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. అంతేకాదు ఈ రుణం ఎవరైతే  తీసుకుంటారో..? వారికి పావలా వడ్డీకే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం  గమనార్హం. ఇల్లు నిర్మించుకునే నేపథ్యంలో ఇంటికి కావలసిన అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్న విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇప్పటికే పెండింగ్లో ఉన్న సుమారు ఎనిమిది వేల దరఖాస్తులను పరిశీలించి , వెంటనే అమలు చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 10. 11 లక్షల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక జగన్ ప్రభుత్వం మొత్తం 15. 60 లక్షల ఇళ్లను నిర్మించడానికి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది . ఏది ఏమైనా ఇల్లు నిర్మించుకునే వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: