మనీ : జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లకు శుభవార్త తెలిపిన కేంద్రం ..!

Divya
కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల వారి కోసం ఈ జన్ దన్ ఖాతాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు గత సంవత్సరంలో ఈ ఖాతా కలిగి వున్న మహిళలకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున వెయ్యి రూపాయలను, రెండు విడతల్లో ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతా లో మహిళలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇకపోతే ఎవరైతే ఈ ఖాతా కలిగి ఉన్నారో , వాళ్లకి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అదేమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఒకటి. అయితే ఈ బ్యాంకులో ఎవరైతే అకౌంట్ కలిగి ఉంటారో, వారికి రెండు లక్షల రూపాయల వరకు అందించడానికి సిద్ధమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఎవరైతే ఖాతాను కలిగి ఉంటారో, వారి పేరు మీద రెండు లక్షల రూపాయలు ఉచిత భీమా కింద అందిస్తారు అన్నమాట. దురదృష్టవశాత్తు ఒకవేళ ఖాతాదారులు మరణించినట్లయితే, నామినీకి లేదా వారి కుటుంబ సభ్యులకు ఈ రెండు లక్షల రూపాయలను భీమా కింద  కేంద్రం ప్రకటించింది.
జన్ ధన్ ఖాతా కలిగిన వారికి రూపే కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రూపే కార్డు ద్వారా తరచూ లావాదేవీలు జరుపుతూ, డబ్బులు బదిలీ చేస్తూ ఉండాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ ఖాతాను ఆక్టివేట్ లో ఉంచుకుంటే , ఈ జీవిత భీమా వర్తిస్తుంది అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే మీకు దగ్గరలో గనుక ఒకవేళ పంజాబ్ నేషనల్ బ్యాంకు లేనట్లయితే ,ఇతర బ్యాంకుల ద్వారా కూడా తీసుకో వచ్చు. కాకపోతే ఇతర బ్యాంకులలో ఒకవేళ మీకు ఖాతా లు  ఉన్నట్లయితే , ఈ భీమా వర్తించదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ భీమా వర్తించాలి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఖాతాను తెరవండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: