మనీ : ఇకపై ఇంటి నుంచి రూ.10 లక్షల వరకు బదిలీ చేయవచ్చు ..!

Divya
సాధారణంగా డబ్బును ఇతరుల ఖాతాకు బదిలీ చేయాలి అంటే, బ్యాంకులలో, ఏటీఎం సెంటర్ల దగ్గర క్యూలో నిలబడి డబ్బులను ఇతరులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఫోన్ పే ,గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పని కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. కాకపోతే ఈ సోషల్ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ల ద్వారా రోజుకు రూ.25 వేలు మాత్రమే పంపించుకోవడానికి వీలుగా ఉండేది. ఒకేసారి ఎవరికైనా అవసరం అనిపించినప్పుడు వివిధ ఖాతాల ద్వారా డబ్బును పెద్ద మొత్తంలో పంపించాలి అంటే తప్పకుండా బ్యాంకులకు వెళ్లి తీరాల్సిందే.
ఒక్కోసారి బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితిలో ఎన్నో అవస్థలు పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటాయి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే సౌకర్యవంతంగా కూర్చొని, చేతి వేళ్లలో డబ్బును బదిలీ చేయవచ్చు. సరికొత్తగా పేటీఎం ఈ సదుపాయాన్ని తీసుకురావడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇకపై ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఏకంగా పది లక్షల రూపాయలను ఇతరుల ఖాతాకు సులభంగా బదిలీ చేయవచ్చు.
పేటీఎం డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు ఈ సేవలను అందిస్తోంది. పేటీఎం ను ఉపయోగించి తమ అకౌంట్ లేదా వాలెట్ ద్వారా డబ్బును వెంటనే ఇతరులకు బదిలీ చేయవచ్చు. అంతేకాకుండా BHIM UPI ద్వారా కూడా UPI ఆధారిత లావాదేవీలను జరపవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు పేటీఎం పై నెలకు పదివేల నుంచి పది లక్షల రూపాయల వరకు డబ్బులను బదిలీ చేయవచ్చు. మీరు కనుక  పేటీఎం యూజర్ అయితే , ఎవరికైతే డబ్బు పంపించాలి అనుకుంటున్నారో, వారి ఖాతా నెంబరు nun కూడా మీ పేటీఎంలో జోడించాల్సి ఉంటుంది. ఆపై మీరు ఈ పెద్ద మొత్తాలను కూడా వారికి సులభంగా ఇంట్లో కూర్చొని పంపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: