మనీ : వారికోసం ఎల్ఐసి అదిరిపోయే ఆఫర్..

Divya
ఎల్ ఐ సి.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తూ, కస్టమర్లను ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలాగ సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎల్ఐసి ప్రవేశపెట్టిన కొన్ని పాలసీలలో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తే, మరికొన్ని స్కీం లలో తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.ఇక ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియం చెల్లించే స్కీమ్ లోనే చేరడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లదు. పైగా వడ్డీతో కలిపిన రాబడి లభిస్తుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఎల్ఐసి ప్రవేశపెట్టిన సరికొత్త పథకం గురించి తెలుసుకుందాం..
అదే మైక్రో బచత్ ప్లాన్.. ఈ స్కీం పేరిట ఎల్ఐసి తమ కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ను  ప్రకటిస్తోంది. ఇందులో చేరడం వల్ల పొదుపుతో పాటు అలాగే ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.  ఇందులో పాలసీ తీసుకునే ముందు 50 వేల నుంచి రెండు లక్షల పాలసీ తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. ఇక ఈ పాలసీ లో చేరాలనుకునే వారు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయస్సు గల వారు కూడా చేరవచ్చు.
అంతేకాదు ఈ పథకంలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత  లోన్ తీసుకునే వెసులుబాటు కల్పించబడింది ఎల్ ఐ సి. ఇందులో ప్రీమియంను కూడా మీకు తగ్గట్టుగా అంటే నెలకు ,మూడు నెలలకు,6 నెలలకు లేదా 9 నెలలకు  ఇలా రకరకాలుగా ప్రీమియం చెల్లిస్తూ ఉండవచ్చు. అంతే కాదు ఇందులో 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా పాలసీని తీసుకోవచ్చు. మధ్య, దిగువ తరగతి కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి అన్న కారణంతో  ఈ పాలసీ ను ఎల్ఐసి అందించడం జరుగుతోంది. మీరు కూడా ఈ పాలసీలో రోజుకు ఇరవై ఎనిమిది రూపాయల చొప్పున ఆదా చేస్తూ వెళ్తే నిర్దిష్ట సమయం తర్వాత రెండు లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: