మనీ : లోన్ కి అప్లై చేస్తున్నారా..? మీకో శుభవార్త..

Divya
ఇటీవల కాలంలో చాలా మంది కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళ కుండా ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటే, మరి కొంత మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మరికొంతమంది ఏదైనా ట్రాక్టర్లను తీసుకొని వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది కార్, ఆటో లాంటివి తీసుకొని టాక్సీలు లాగా నడుపు కోవాలని మరికొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరి కొంతమందేమో సొంతంగా ఏదైనా క్యాంటీన్ లాంటి పెట్టుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా సరే తప్పకుండా లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు..ఇక ఈ నేపథ్యంలో ఎవరైనా సరే లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే , అలాంటి వారికి ఇప్పుడు ఒక తీపి కబుర్లు తీసుకొచ్చింది కరూర్ వైశ్య బ్యాంక్.. ఈ బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడు , వాటిపై రుణ రేట్లను కూడా తగ్గిస్తూ, కస్టమర్లకు చేరువ అవ్వాలనే ఆలోచనతోనే బ్యాంక్ ఇలా ప్రయత్నం చేస్తోంది . దీంతో రుణ గ్రహీతలకు ఇది ఒక మంచి ప్రయోజనం అని చెప్పవచ్చు.

అందుకే త్వరలోనే రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్  అండ్ బెస్ట్ లెండింగ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కరూర్ వైశ్య బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. 0.5 శాతం వరకు వడ్డీ పై కోత విధించి,  బ్యాంక్ రేపో లింక్డ్  ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ను కూడా దాదాపుగా 7.05 శాతానికి తగ్గించడం గమనార్హం. లోన్ పై వడ్డీ  రేట్ల తగ్గింపు అనే విషయం ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు.. ఇక కరూర్ వైశ్య బ్యాంకు రుణ గ్రహీతల పై 8.75 శాతంగా వడ్డీని నిర్ణయించింది.కానీ దానిని ఇప్పుడు 8.25 శాతం దానికి తగ్గించింది.
గత రాత్రి నుంచి 6 నెలలు ముందు తీసుకున్న రుణగ్రహీత లోన్ పై  కూడా 0.5 శాతం వడ్డీని తగ్గించి, రుణ గ్రహీతలకు ఊరటను ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: