చేతిలో ఐదారు ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న నటి....!!

murali krishna
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్ ఠాకూర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం.
ఐతే పోయిన సంవత్సరం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క మూవీ తో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ మూవీతో భారీ హిట్ టాక్ ని తన అకౌంట్ లో వేసుకుంది. సీతారామం మూవీలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఐతే ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో సినిమాకు ముందు ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఈ విడుదల తర్వాత ఆమెను చాలామంది అభిమానులు మృణాల్ ఠాకూర్ కాకుండా సీత అని పిలవడం మొదలుపెట్టారు. కాగా సీతారామం సినిమా తర్వాత మృణాల్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అవకాశాలు తలుపు తడుతున్నాయి.
కాగా మృణాల్ సీతారామం తర్వాత మృణాల్ తరువాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ  అనే సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్కు రీమేక్గా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను రాబట్ట లేకపోయింది. ఇది ఇలా ఉంటే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేయడానికీ రెడీ అవుతోంది. సీతారామం సినిమా తర్వాత తెలుగులో ఆమె ఎటువంటి సినిమాలలో నటించబోతోంది అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ఏదో ఒక సినిమా కాకుండా ఫైనల్ గా ఇటీవల తెలుగులో తన రెండోవ సినిమాని నాని 30 గా ప్రకటించింది ఈ బ్యూటీ. అంతేకాకుండా మృణాల్ ఇటీవలే నానితో సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అలానే ఈ చిత్రం రెండోవ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అలా మొత్తంగా మృణాల్ చేతిలో దాదాపు ఒక అయిదారు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది ఈ ముద్దుగుమ్మ.
ఏదేమైనా తెలుగులో మంచి మంచి ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న మృణాల్ ని చూసి ఆమె అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: