"ఏమిగొస్" ట్రైలర్ విడుదల వేదికను ఖరారు చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా , నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ద్వారా మంచి విజయం అందుకున్న కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ ... రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించినటువంటి ఎమిగోస్ అనే మూవీ లో హీరోగా నటించాడు.

ఈ మూవీ లో కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి సారి త్రిపాత్రభినయంలో నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ త్రిపాత్రభినయంలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
 

అలాగే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ఈవెంట్ జరగబోయే ప్రదేశాన్ని ... ప్రారంభం అయ్యే సమయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏమిగొస్ మూవీ యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ... శ్రీరామ థియేటర్ ... కర్నూల్ లో నిర్వహించనున్నట్లు ఈ  మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి బింబిసారా మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ "ఏమిగొస్" మూవీతో ఏరేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: