ఆ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రణీత..!.

Anilkumar
కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం వంటి తెలుగు సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ కన్నడ హీరోయిన్ .తెలుగులో చేసింది తక్కువ సినిమాలో అయినప్పటికీ ఆ తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును పొందింది ప్రణీత. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరే తెలుగు సినిమాలలో కూడా నటించలేదు ప్రణీత. ఇదిలా ఉంటే 2021లో నితిన్ అనే ఒక బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది ప్రణీత. 

దాని అనంతరం పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే ఒక పాప కి కూడా జన్మనిచ్చింది ప్రణీత. ఇక ఈ విషయాన్ని  స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తన అభిమానులతో పంచుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రణీత గురించి ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

మలయాళం లో ప్రముఖ హీరో దిలీప్ నటిస్తున్న 148 సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఎంపికయింది ప్రణీత. తల్లి అయిన తర్వాత ప్రణీత నటిస్తున్న మొదటి సినిమా ఇది. అయితే తాజాగా ఈ విషయాలపై ప్రణీత మాట్లాడుతూమ్ నేను బెంగళూరు నుంచి వచ్చి వెళుతున్నాను.. మొదటిసారి నా కూతురుకి ఇంత దూరంగా ఉండబోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది..కానీ ఇలా జరగడం సహజం వర్కింగ్ మదర్స్ కి మాత్రమే ఇలాంటి బాధ తెలుస్తుంది.. సాధారణంగా పని మరియు ఇల్లు రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అందరూ చేసేదే.. ప్రస్తుతం నేను కూడా అదే పని చేస్తున్నాను అంటూ తన సినిమాల రియంట్రి గురించి చెప్పుకొచ్చింది ప్రణీత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: