తారకరత్నకు సీరియస్.. ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్?

praveen
నందమూరి హీరో రాజకీయ నాయకుడు తారకరత్న ఇటీవల గుండెపోటు గురయ్యారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరారు.  ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎంతో క్రిటికల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే గుండెపోటు ఆసుపత్రిలో చేరిన తారకరత్న ఆరోగ్యం ఎంతో సీరియస్ గా ఉందని డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నేపథ్యంలో సినీ, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యామిలీలో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయ్ అని చెప్పాలి.

 ఇటీవలే ప్రారంభించిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్న సమయంలో ఇక ఇలా గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రత్యేక వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తుంది అన్నది తెలుస్తుంది. అయితే ఎక్మో పరికరం ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ఇక తారకరత్నను కాపాడుకునేందుకు వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం గుండెపోటుతో ఆసుపత్రి పాలైన తారకరత్న త్వరగా కోలుకొని రావాలి అంటూ ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తారకరత్న అన్న మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు సాయి ధరంతేజ్.  ఇక ఇప్పటికే తారకరత్న వెంటనే ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్న అంటూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళబోతున్నారు అన్నది తెలుస్తుంది. తన అన్న తారాకరత్న  గుండెపోటు బారిన పడటం జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ తారకరత్న సోదరుడు కృష్ణ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ntr

సంబంధిత వార్తలు: