ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ కి నిరాశ..!

Divya
ఆస్కార్ రేసులో జూనియర్ ఎన్టీఆర్ కి నిరాశ మిగిలిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే వివిధ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ ని ఈరోజు ప్రకటించగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట మాత్రమే ఎంపికైంది.. బెస్ట్ యాక్టర్ క్యాటగిరిలో జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక అవుతాడని అంతా భావించారు అంతేకాదు #NTRForOscars అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేశారు.
కానీ ఆ ఆశలు నెరవేరలేదు.  లగాన్ తర్వాత ఆస్కార్కు నామినేట్ అయిన మరో భారతీయ చిత్రం ఇదే. ఇండియన్ మూవీ హిస్టరీ లో చరిత్ర సృష్టించింది.  డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండో భారతీయ డాక్యుమెంటరీ చిత్రంగా చోటు దక్కించుకుంది.  కానీ తాజాగా విడుదల చేసిన ఆస్కార్ నామినేషన్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోకపోవడం నిజంగా నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. తాజాగా ఆస్కార్ నామి నేషన్ కి సంబంధించి లిస్టును విడుదల చేయగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగు మినహాయిస్తే.. మరీ ఇతర విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకోలేదు.
నిజానికి అమెరికాలో ఒక మ్యాగజైన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును ఆస్కార్ నామినేషన్ కి షార్ట్ లిస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఆస్కార్ కి కూడా ఎన్టీఆర్ గట్టి పోటీదారుడు అని కూడా అందులో పేర్కొంది. అందుకే అభిమానులలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.  అయితే తాజాగా విడుదల చేసిన నామినేషన్ లిస్ట్ గమనించినట్లయితే ఇక్కడ భారత్ నుంచి ఎవరు కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ కాకపోవడం గమనార్హం. కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి కూడా ఈ రేసులో నిలిచారు అయితే అతని పేరు కూడా నామినేట్ అవ్వలేదు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు రాజమౌళి కూడా నిరాశ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: