అహింస గురించి టెన్షన్ పడుతున్న రానా !

Seetha Sailaja
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వారసులుగా వచ్చిన వెంకటేష్ రానా లు ఇప్పటికే తమ ప్రత్యేకతను కొనసాగిస్తూ తమకంటూ ఒక స్థానాన్ని సినిమా రంగంలో ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు ఇదే కుటుంబానికి చెందిన అభిరామ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే రంగం సిద్ధం అయింది. తేజా దర్శకత్వంలో ‘అహింస’ అన్న టైటిల్ తో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈమూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది అన్నవార్తలు వస్తున్నాయి.

ఈసినిమాకు సంబంధించి ఆర్.పి పట్నాయక్ ట్యూన్ చేసిన పాటలకు కూడ మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రావాల్సినంత ఎటెన్షన్ మాత్రం ప్రేక్షులలో రాకపోవడంతో ఈ సినిమాపై రానా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ అంతా రానా స్వయంగా చూస్తున్నాడట. తన తమ్ముడి సినిమా కోసం బెస్ట్ రిలీజ్ డేట్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడట రానా.

లేటెస్ట్ గా ఈమూవీ ట్రైలర్ ను తన స్నేహితుడు రామ్ చరణ్ తో సోషల్ మీడియాలో రిలీజ్ చేయించాడు రానా. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొందరు సెలెబ్రెటీల సహకారం కూడ తీసుకోవడమే కాకుండా ఈసినిమాను కొందరు ఇండస్ట్రీ ప్రముఖులకు చూపెట్టి దానిపై రానా సలహాలు కూడ తీసుకుంటున్నాడు అని టాక్. వాస్తవానికి ఈమూవీని నిర్మించింది ఆనంది ఆర్ట్స్ అయినప్పటికీ సురేష్ బాబు రానా ఈ సినిమాకు స్పెషల్ కేర్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి లో ఈసినిమాను విడుదల చేయాలని పక్కా ప్లాన్ లో ఉన్నట్లు టాక్. కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ దర్శకుడు బాపు సూపర్ స్టార్ కృష్ణ తొలి రోజులలో తీసిన ‘సాక్షి’ మూవీ ఛాయలు ఈమూవీ కథలో కనిపిస్తాయని అంటున్నారు. ఒక పిరికివాడు తిరగబడితే జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తేజా తన మార్క్ దర్శకత్వంలో ఈమూవీని తీసినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: