ఆ యంగ్ హీరోయిన్ ని చూసి భయపడుతున్న పూజ హెగ్డే.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే. అయితే పూజ హెగ్డే కి గతేడాది ఏమాత్రం కలిసి రాలేదు అని చెప్పాలి.నాలుగైదు సినిమాలలో నటించినప్పటికీ అన్ని సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో పూజ హెగ్డేది ఐరన్ అనే మరక పడింది. అయితే ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది అన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే ఎంపికైనట్లు అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తుంది. అంతేకాదు ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుంది పూజా హెగ్డే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. అంతేకాదు ఇటీవల మహేష్ బాబు ఈ సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఒక స్పెషల్ సెట్ లో ఈ సినిమా మరో షెడ్యూల్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం నిర్మించే ఒక స్పెషల్ హౌస్ సెట్ లో మహేష్ బాబు పూజ హెగ్డే మరియు శ్రీ లీల కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించిన సమయంలోనే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.

అంతేకాదు గతంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది అని ఎక్కడా కూడా లీక్ చేయలేదు. తర్వాత ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా ఒక హీరోయిన్ ని మాత్రమే అనుకున్నారు.కాకపోతే మహేష్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్ మార్చమని కోరడంతో సెకండ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో చేరింది. అయితే త్రివిక్రమ్ అనుకున్నా కథలో సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.కానీ ఈ సినిమా స్క్రిప్ట్ మార్చిన అనంతరం ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్ల కి సమాన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. అయితే ఇక్కడే పూజా హెగ్డే కి ఇది కాస్త తలనొప్పిగా మారింది.పూజా హెగ్డే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. చాలా కాలం అయినప్పటికీ ప్రస్తుతం ఆమెకి హిట్ సినిమాలు లేవు.కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలకి మంచి క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే శ్రీలీలకి మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా క్రెడిట్ మొత్తం శ్రీలీలకి వెళ్లిపోతుందేమో అన్న భయంతో పూజా హెగ్డే ఉంది అని ప్రచారం జరుగుతుంది. శ్రీ లీల ఈ సినిమా క్రెడిట్ ఎక్కడ దక్కించుకుంటుందో ఏమో అన్న టెన్షన్లో పూజ హెగ్డే ఉంది అని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: