రాంచరణ్ కు కండిషన్ పెట్టిన బాలీవుడ్ బాద్షా...!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమా ద్వారా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతున్నారు.ఇలా ఈ సినిమా 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

ఇక విడుదల తేదీ కూడా దగ్గరపడటంతో చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో కూడా విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన షారుఖ్ ఖాన్ కు వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఇందులో ఓ ప్రశ్న మాత్రం అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ షారుక్ ను ప్రశ్నిస్తూ.. హాయ్ సర్ మీరు పఠాన్ సినిమా విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాలలోని మూవీ థియేటర్స్ కు వస్తారా అని ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు షారుక్ సమాధానం చెబుతూ...తప్పకుండా వస్తాను అయితే నన్ను రామ్ చరణ్ వచ్చి తీసుకు వెళ్తేనే వస్తాననే కండిషన్ కూడా పెట్టారు.ఇలా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ తీసుకువెళ్తేనే వస్తానంటూ మెగా పవర్ స్టార్ గురించి ప్రస్తావించడంతో అందరి దృష్టి ని అయితే ఆకర్షించింది.అయితే వ్యక్తిగతంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా నే లాంచ్ చేశారు. అదేవిధంగా rrr సినిమాకు వచ్చే ఆస్కార్ ను నన్ను కూడా ఒక్కసారి తాకనివ్వండి అంటూ కూడా రామ్ చరణ్ కు షారుక్ కామెంట్ చేయడం గమనార్హం..ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే చెప్పవచ్చు.మరి షారుక్ పెట్టిన కండిషన్ కు రాంచరణ్ ఒప్పుకొని తనని థియేటర్ కి తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి మరి.03:21 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: