తెలుగులో టాప్ హీరో.. అతనేనా..?

Divya
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరో ఎవరన్న విషయం పై అభిమానులు ఎప్పుడూ కూడా మా హీరో అంటూ మా హీరో అని తెలియజేస్తూ ఉంటారు. వాస్తవానికి నెంబర్ వన్ హీరో ఎవరు ఈ విషయం మీద ఎప్పటినుంచో పలు చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. ఎందుకంటే ఏ హీరో తక్కువ కాదు ఎక్కువ కాదు అని చెప్పవచ్చు. అయితే.. ఇలాంటి విషయాలను గమనించిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల, ప్రతి సంవత్సరం టాప్ హీరోలు ఎవరనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరిగిన తర్వాతనే ఈ హీరోల జాబితాను ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించడం జరుగుతుందట. అలా 2022 సంవత్సరానికి గాను..ఆర్మాక్స్ మీడియా తెలుగులో మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ లిస్టులో ఎప్పటిలాగే హీరో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఎన్టీఆర్ మూడవ స్థానంలో అల్లు అర్జున్ నాలుగవ స్థానంలో రామ్ చరణ్ ఐదవ స్థానంలో మహేష్ బాబు ఆరో స్థానంలో పవన్ ఏడవ స్థానంలో నాని.. 8వ స్థానంలో విజయ్ దేవరకొండ 9వ స్థానంలో చిరంజీవి పదోవ స్థానంలో రవితేజ నిలవడం జరిగిందట.

మొత్తం మీద తెలుగులో ప్రభాస్ ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, మహేష్ బాబు ,రామ్ చరణ్ వంటి వారు టాప్ ప్లేస్ లో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక మిగిలిన హీరోలు మాత్రం వారి స్థాయికి తగ్గట్టుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఈ లిస్టు 2022 సంబంధించి మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ జాబితాగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం సోషల్ మీడియాలో   ఎక్కువ చర్చ జరిపిన తరువాతనే విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోలు సైతం ఎవరి సినిమాలో వారు బిజీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: