ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మెచ్చుకున్న చిరంజీవి...!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి అయితే ఉంటారు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన `ఆర్ఆర్ఆర్‌ ' సినిమాతో వీళ్ళిద్దరి స్నేహం మరింత గా అయితే బలపడింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. కేవలం ఇండియా లోనే కాకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడులై మంచి పాజిటివ్ టాక్ ను అయితే సంపాదించుకుంది. ఇటీవల ఈ సినిమా అంతర్జాతీయ గ్లోబల్ అవార్డ్స్ ను కూడా అందుకుంది. తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేశాడు జక్కన్న.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య మంచి స్నేహం కుదిరిందని అందరూ కూడా అనుకున్నారు. కానీ సినిమా ప్రారంభం కాకముందు నుంచే తాము మంచి స్నేహితులం అని గతంలోనే ఆయన పేర్కొన్నారు. అయితే రామ్ చరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవికి కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమట. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే చిరంజీవి కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే అభిమానం అని తెలుస్తుంది.. ఎన్టీఆర్ నీ చాలా ప్రత్యేకంగా అభిమానిస్తారని సమాచారం.
ముఖ్యంగా డాన్స్ విషయం లో ఎన్టీఆర్ ను చిరంజీవి ఎంతగానో అభిమానిస్తారట. అలాగే ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాను చిరంజీవి చూస్తారని సమాచారం.. సినిమా చూశాక ఎన్టీఆర్ కు ఫోన్ చేసి సినిమా లో బాగా చేశావని కూడా అభినందిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యాక కూడా చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ఎంతగానో మెచ్చుకున్నారటా. నటన మరియు డాన్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారంట. మరీ ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటుంది గా మరి.. ఎన్టీఆర్ నటన అంటే ఎవరికైనా ఇష్టమే అని అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: