త్రిబుల్ ఆర్.. ఎన్టీఆర్ ను కాదని.. చరణ్ కు అవార్డు?

praveen
ఇటీవల కాలంలో స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. సినిమాల్లో కాదు ఇక బయటే అంతకుమించి అనే రేంజ్ లోనే ట్రెండీ లుక్ తో కనిపిస్తూ ఉన్నాడు రామ్ చరణ్. దీంతో అతని లుక్ ని ఫాలో అవ్వడానికి అటు అభిమానులు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. ఇక ఏదైనా ఫంక్షన్కు వెళ్లినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయే విధంగా తన డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల త్రిబుల్  ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.

 ఈ క్రమంలోనే అవార్డు వేదికపై ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లు కూడా సందడి చేశారు. అయితే ఈ అవార్డు ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ సూట్ బూట్ వేసుకొని ఫారిన్ లుక్ లో మెరిసాడు. అయితే చరణ్, రాజమౌళి కీరవాణి లు మాత్రం భారతీయ సాంప్రదాయాన్ని ప్రమోట్ చేసే విధంగానే ఇక సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలా సాంప్రదాయ వస్త్రధారణలో అవార్డు ఫంక్షన్ కి హాజరైన రామ్ చరణ్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు.

 ఇప్పుడు వరకు ఏ ఇండియన్ సెలబ్రిటీ సాధించని రికార్డును కొల్లగొట్టాడు రామ్ చరణ్ అని చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కి రామ్ చరణ్ వేసుకు వెళ్లిన డ్రెస్ ఇక ఈ ఘనతను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన బెస్ట్ డ్రెస్ మెన్ టాప్ టెన్ సెలబ్రిటీల జాబితాలో ఇక రామ్ చరణ్ కూడా ఎంపిక కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి కూడా ఈ లిస్టులో చోటు తగ్గలేదు అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఫారెన్ లుక్ లో అదరగొట్టిన ఇక సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన రామ్ చరణ్ వైపే గోల్డెన్ గ్లోబ్స్ మొగ్గు చూపింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: