రాంచరణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

murali krishna
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ తేజ్ గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చాడు. అవి రెండు కూడా మల్టీ స్టార్ సినిమాలు కావడం గమనార్హం . మొదట రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన rrr సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని అయితే లేదు.. ఇక తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చేసినటువంటి ఆచార్య సినిమా తో ప్రేక్షకులను అయితే పలకరించాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించినంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. తీవ్రంగా నిరాశపరిచింది.

అయినప్పటికీ కూడా రామ్ చరణ్ తదుపరి సినిమాలపై అంచనాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు. ప్రస్తుతం అతను శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం.డ్యూయల్ రోల్ అని టాక్ వస్తోంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా లీక్ అయ్యాయి.

అయితే RC15 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్  ఎంతో ఆతృతగా అయితే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే రామ్ చరణ్ సంబంధించిన మరొక స్పెషల్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

మార్చి 27వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ RC 15 కు సంబంధించిన ఒక పవర్ఫుల్ పోస్టర్ తో పాటు ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.అంతేకాకుండా రామ్ చరణ్ కు సంబంధించిన మరొక సరికొత్త ప్రాజెక్టుపై కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోందని సమాచారం..10:06 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: