రాజమౌళి సినిమాల్లో నాకు ఆ సినిమా అంటే అస్సలు ఇష్టం లేదు అంటున్న రమా రాజమౌళి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శక దిగ్గజం రాజమౌళి. అయితే రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా తన భార్య రమా రాజమౌళి పనిచేస్తుంది అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. రాజమౌళి తెరకెక్కించే సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఎలాంటి కాస్ట్యూమ్ బాగుంటుంది అన్న విషయాలను తన భార్య తో  రాజమౌళి చర్చించి ఫైనల్ చేస్తారుమ్ అయితే నిజానికి రాజమౌళి తెరకెక్కించే ఏ సినిమాలో అయినా సరే తన కుటుంబ సభ్యులే ఎక్కువమంది ఉంటారు. 

అయితే తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఇంటర్నేషనల్ అవార్డు వేడుకలో భాగంగా తన భార్య గురించి మాట్లాడుతూ నా జీవితంలో తన సక్సెస్ లో ముఖ్య పాత్ర తన భార్యదే అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక అసలు విషయానికి వస్తే.. తన భార్య రమా రాజమౌళికి రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక సినిమా అంటే ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది రాజమౌళి భార్య. ఇక ప్రస్తుతం ఆమె చెప్పిన వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది రమా రాజమౌళి.ఇక ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని

 అందుకుందో మనందరికీ తెలిసిందే. రొటీన్ కదా అయినప్పటికీ రాజమౌళి తన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ తనకి అస్సలు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చింది రమా రాజమౌళి. దీంతో ఈ వార్త విన్న చాలామంది విశ్లేషకులు ఎందుకు రమా రాజమౌళికి ఈ సినిమా నచ్చలేదు అన్న ఆలోచనలో పడ్డారు. అనంతరం ఈ సినిమా నాకు పెద్దగా కనెక్ట్ కాలేదు అని చెప్పుకొచ్చింది. ఇందులో ఎన్టీఆర్ నటన అత్యద్భుతంగా ఉంది కాబట్టే ఈ సినిమా హిట్ అయిందని ఆయన నటన వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అని చెప్పుకొచ్చింది రమ రాజమౌళి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: