డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గాను గోల్డెన్ గ్లోబ అవార్డు కూడా రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హాలీవుడ్ రేంజ్ లో త్రిబుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.దీంతో రాజమౌళి పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇటీవల హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్విల్ బర్గ్ జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా గురించి గాను రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించాడు. జేమ్స్ కెమెరూన్ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటే 

ఆయన మాత్రం త్రిబుల్ ఆర్ సినిమా ఆయనకి బాగా నచ్చింది అంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించడం చాలా గొప్ప ప్రశంస అని చెప్పాలి. రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో హైప్ తీసుకొచ్చాడు. ఇక హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాకి హైప్ తీసుకురావడం ఆయన తదుపరి సినిమాకి కూడా ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే హాలీవుడ్ ప్రేక్షకులని కూడా దృష్టిలో ఉంచుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని ఆ రేంజ్ లో పెరకెక్కించాలి అని భావిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ నటులని రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.

 గతంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చాలా సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు మహాభారతం కాన్సెప్ట్ ని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తాను అని కూడా చెప్పుకొచ్చాడు రాజమౌళి.ఆ సినిమాని తీసిన అనంతరం సినిమాలకు స్వస్తి చెబుతాను అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం చెప్పలేదు రాజమౌళి. ఇందులో భాగంగానే తాజాగా రాజమౌళి ఈ ప్రాజెక్టుని ఇలాంటి సమయంలో మొదలుపెడితే కచ్చితంగా ఆ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఖాయమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తే భారతీయ చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ఇంకా బాగుంటుంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుని ఎప్పుడు మొదలు పెడతారు అన్న వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: