తెలుగు సినిమా నిర్మాతల మండలి లో ఎన్నికలు షురూ..!

Divya
టీఎఫ్పీసీ.. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎన్నికలు జరగనున్నాయి అని.. ప్రముఖ నిర్మాత సీ.కళ్యాణ్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. నిర్మాతల మండలకి సినీ పరిశ్రమలో చాలా గొప్ప చరిత్ర ఉంది.. దానిని ఎప్పుడు మేము బాగుండాలని కోరుకుంటాము. అందుకు తగ్గట్టుగా పోరాడుతాము.. తెలుగు సినిమా నిర్మాతల మండలి పై కొంతమంది కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే కొంతమంది పైన శాశ్వత బహిష్కరణ కూడా విధించడం జరిగింది.
కొంతమంది మండలిలో ఎన్నికలు జరగట్లేదు అని తెగ రాద్దాంతం చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టం చేయడానికి నేను మీడియా ముందుకు వచ్చాను అని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. వచ్చేనెల 19న నిర్మాతల మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది.. నామినేషన్లు సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి 10వ తేదీ చివరి రోజు. 19వ తేదీన ఎన్నికల నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుపుతాము అలాగే జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అంటూ సి కళ్యాణ్ తెలిపారు.
ఇప్పటికీ మా కౌన్సిల్లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్ వుంది. ఇన్ని ఫండ్స్ రావడానికి దాసరి నారాయణరావు సహాయ సహకారాలే కారణం అని మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఫిబ్రవరి 19వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతల మండలకి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికల గురించి మాట్లాడుతూనే.. మరొకవైపు ఆంధ్రకు సినిమా ఇండస్ట్రీ రావడం కష్టం అని తేల్చి చెప్పేశారు. అందుకు ఉదాహరణ ఆంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ప్రకారం ఆర్డిఎక్స్ లవ్ సినిమా తీయగా.. తనకు రూ.3 కోట్లు అదనంగా ఖర్చు వచ్చింది.. దీనివల్ల ఎవరు కూడా అంత డబ్బు పెట్టుకొని ఆంధ్రా లో సినిమాలు చేయలేరు అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: