పెళ్లయినా కూడా తగ్గేది లేదంటున్న శ్రియ..!!

Divya
టాలీవుడ్లో హీరోయిన్ శ్రియ అచ్చ తెలుగు అమ్మాయి గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వివాహమైన విషయాన్ని దాచిపెట్టి ఏకంగా ప్రసవించిన తర్వాత తనకు వివాహమైందనే విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది శ్రియ. ఇక వివాహమైన తర్వాత ఈమె అందచందాల విషయంలో ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది.
తాజాగా శ్రియ బాల్కనీ గార్డెన్లో నిల్చోని కొంటె పోజులను ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. శ్రియ తీరును చూసి ఎవరి కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. శ్రియ కెరియర్ విషయానికి వస్తే.. తాజాగా బాలీవుడ్లో దృశ్యం 2 సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇటు పర్సనల్ లైఫ్ లో అటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా శ్రియ అడపా దడప సినిమాలలో నటిస్తూ ఉంటోంది. గత ఏడాది rrr సినిమాలో నటించి బాగా ఆకట్టుకుంది.
శ్రియ కెరియర్ ముగుస్తోంది అనుకుంటున్నా సమయంలో తెలివిగా ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకుంది. 2018లో శ్రియ - ఆండ్రు వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తెలుగులో జనరేషన్తో స్టార్స్ తో నటించిన ఘనత అందుకుంది శ్రియ.
కెరియర్లో అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ గొప్ప డాన్సర్ గా కూడా అప్పట్లో పేరు సంపాదించింది. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన గమనం సినిమా పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. శ్రియ గత కొంతకాలంగా హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: