లాభల్లోకి వచ్చేసిన వాల్తేరు వీరయ్య?

Purushottham Vinay
ఇక మెగాస్టార్ చిరంజీవి గత మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యేసరికి ఇక చిరంజీవి పని  అయిపోయిందని చాలామంది కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేసారు..కానీ 'వాల్తేరు వీరయ్య' సినిమా మరోసారి చిరు క్రేజ్ ఏంటో నిరూపించింది.. జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి చిరంజీవిని ద్వేషించేవాళ్ళు కూడా ఆశ్చర్య పోయే పరిస్థితి ఏర్పడింది.. ఇక సంక్రాంతి పండగ సెలవలు కూడా దాదాపుగా ముగిసినట్టే.. ఈరోజు కలెక్షన్స్ కూడా తగ్గుతాయి అని అనుకున్నారు.. కానీ 'వాల్తేరు వీరయ్య' సినిమాతో పాటు విడుదలైన సినిమాలు కొన్ని ప్రాంతాలలో తగ్గిపోయాయి కానీ, వీరయ్య సినిమా విజృంభణ మాత్రం అసలు ఆగలేదు.5వ రోజు కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది..


ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయిల దాకా జరిగింది.. ఇప్పటికే నైజాం ఇంకా ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో నిన్ననే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి ఈ సినిమా అడుగుపెట్టింది.. ఇక ఈరోజుతో మిగిలిన ప్రాంతాలలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వచ్చేసిందని సమాచారం తెలుస్తుంది.ఇక నాలుగు రోజుల్లో సుమారుగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా , 5 రోజులకు కలిపి 90 కోట్ల రూపాయిల వరకు షేర్ ని వసూలు చేసిందని సమాచారం తెలుస్తుంది.అంటే బ్రేక్ ఈవెన్ మార్కు కి దాటేసినట్లు సమాచారం తెలుస్తోంది.. ఫుల్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని.. ఇక 150 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని సినిమా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.మరి చూడాలి ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: