ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న పవన్.. ఎప్పటినుండి అంటే..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాని మొదలుపెట్టే పనిలో ఉన్నాడట పవన్ కళ్యాణ్.అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. 

ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోని ఒరిజినల్ లైన్ ని హరీష్ శంకర్ తీసుకొని పవన్ కి తగ్గట్లుగా సరికొత్త కథను సిద్ధం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఇక సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ వినోదయ సీతం సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఇకపోతే మాతృక లో సముద్రఖని పోషించిన క్యారెక్టర్ లో తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారట. కాగా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అన్న వార్తలు ఎప్పటినుండో వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి ధరంతేజ్ ది లీడ్ రోల్ అని తెలుస్తుంది. అతని కథని పవన్ కళ్యాణ్ నడిపించే పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో పవన్ పాత్ర టైంకి రిప్లైకేట్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 27 నుండి ప్రారంభం కానుంది అని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 45 రోజుల కాల్చి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకక్కబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: