సమంత కి భయపడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ సినిమా అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏం మాయ చేసావే సినిమా అనంతరం వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో సైతం నటించింది.ఇటీవల యశోద సినిమాతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె నటించిన శాకుంతల అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఫిబ్రవరి 17న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానంది. 

అయితే సమంతకి సంబంధించిన ఒక విషయంలో స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకున్నాం. అయితే సమంత నటిస్తున్న శాకంతులం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తాము అని దిల్ రాజు మరియు చిత్ర బృందం ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ధనుష్ హీరోగా నటించిన సర్ సినిమా కూడా ఆ సమయంలోనే విడుదల కానుంది. అంతేకాదు విశ్వక్సేన్ నటించిన సినిమా సైతం ఆ సమయంలోనే విడుదల కానుంది.అంతేకాదు కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు కథ సినిమా సైతం ఆ సమయంలోనే విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. కానీ తాజాగా ఫిబ్రవరి 17న భారీ అంచనాల మధ్య సమంత నటించిన శకుంతలం సినిమా విడుదల కానుంది.

ఇక ఈ సినిమాతో ఇప్పటికే ఇద్దరు యంగ్ హీరోలో భయపడుతున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. దీనికిగాను తమ సినిమాలను పోస్ట్ ఫోన్ కూడా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందుకు ముఖ్య కారణం ఒకవేళ శాకంతులం సినిమా మరియు ఆ ఇద్దరి స్టార్ హీరోల సినిమా ఒకే రోజు విడుదలయితే కనుక మిగిలిన సినిమాలకి థియేటర్స్ దొరకవు. ఇందులో భాగంగానే సమంత సినిమాని చూడడానికి అందరూ ఎక్కువ ఇష్టపడతారేమో అన్న ఉద్దేశంతో ఇద్దరు యంగ్ హీరోలు తమ సినిమాని పోస్ట్ ఫోన్ చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ యంగ్ హీరోలు ఇద్దరు కూడా వారి సినిమాలను మార్చిలో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హీరో విశ్వక్సేన్ నటించిన సినిమాని మార్చ్ లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త తెలిసిన చాలా మంది నైటిజన్స్ ఆ యంగ్ హీరోలో ఇద్దరు కూడా సమంతకి భయపడి అలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్న కామెంట్లను వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: