గందరగోళంగా మారిన సినిమా వసూళ్లు?

Purushottham Vinay
అన్ని సినిమా ఇండస్ట్రీలలో జనాలని థియేటర్ లకి రప్పించడానికి ఫేక్ కలెక్షన్ల, తప్పుడు రికార్డులతో హీరోలను ఇంకా అభిమానులను మాయ చేస్తుంటారు నిర్మాతలు.కొంతమందేమో ఈ కలెక్షన్ల పోస్టర్లకు చాలా వ్యతిరేకంగా ఉంటే.. మరి కొంత మంది హీరోలు మాత్రం వాటినే చాలా గొప్ప రికార్డుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగిన 4 సినిమాల లెక్కల వివరాలు ఇప్పుడు అందరినీ కూడా తెగ ఆలోచనలో పడేస్తున్నాయి.లోకల్‌ మార్కెట్ ఇంకా అలాగే సినిమాకి వచ్చే కలెక్షన్లను అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఓవర్సీస్ లెక్కలు మాత్రం ఖచ్చితంగా చాలా జెన్యూన్ గా ఉంటాయి. అందుకే ఓవర్సీస్‌ కలెక్షన్లను అంచనా వేసి సినిమా హిట్టా? బ్లాక్ బస్టరా? లేదా ఫట్టా? అనే విషయాన్ని చాలా ఈజీగా చెప్పొచ్చు.ఇక అక్కడ మినిమం వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిందంటే చాలు ఆ సినిమాను హిట్టుగా చెప్పుకోవచ్చు. సినిమాకి జరిగిన బిజినెస్‌తో పోల్చి చూసి ఇంకా ఆ వచ్చిన కలెక్షన్లు చూస్తే సినిమా ఏ స్థితిలో ఉందో కూడా మనం ఒక క్లారిటీగా చెప్పుకోవచ్చు.


ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు  బాలయ్య, చిరంజీవి సినిమాలు వీర సింహా రెడ్డి,  వాల్తేరు వీరయ్య విషయంలో మొదటి నుంచి కూడా ఓవర్సీస్ టార్గెట్, బ్రేక్ ఈవెన్ నంబర్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా కంటే ఒక రోజు ముందుగానే వీర సింహా రెడ్డి సినిమా బరిలోకి దిగింది. అయినా కూడా కలెక్షన్లలో మాత్రం చాలా పెద్ద తేడా ఉంది. నిజానికి చిరంజీవి తన సినిమాతో లేటుగా బరిలోకి దిగాడు. కానీ ఆశ్చర్యంగా కలెక్షన్లలో మాత్రం ముందున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా రెండు మిలియన్ల డాలర్లకు దగ్గర్లో ఉంటే.. వీర సింహా రెడ్డి సినిమా మాత్రం ఇంకా వన్ మిలియన్ డాలర్ వద్దే ఉన్నాడు.ఇక ఓవర్సీస్‌లోనే అంత భారీ తేడా ఉంటే.. లోకల్‌గా ఇంకెంత తేడా ఉండాలనే ఫ్యాన్స్ డౌట్ . కానీ వెంట వెంటనే వంద కోట్ల పోస్టర్లు వేసుకుంటూ వెళ్లడంతో అందరలో కూడా ఈ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.ఇక మన దగ్గర పరిస్థితి ఇలా ఉంటే తమిళ నాట మాత్రం ఇంకోలా ఉంది. అసలు అక్కడ ఏ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయి? ఏ సినిమా వసూళ్లు నిజమో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తునివు ఇంకా వారిసు సినిమాల లెక్కలు ఇప్పుడు చాలా గందరగోళంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: