4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ సాధించిన కలెక్షన్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని మైత్రి సంస్థ నిర్మించగా , శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ మూవీలో బాబీ సింహ , ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలలో నటించగా , మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

రవితేజ కు భార్య పాత్రలో ఈ మూవీ లో కేదరిన్ నటించింది. ఈ మూవీ జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఇప్పటికే 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.


మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ 29.30 కోట్ల షేర్ , 49.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.16 కోట్ల షేర్ , 26.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15.01 కోట్ల షేర్ , 26.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.
నాలుగవ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 14.77 కోట్ల షేర్ , 25.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 73.68 కోట్ల షేర్ , 127.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ కి ప్రస్తుతం కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: