లక్కీ అంటే మహేష్ బాబు దేనా..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి హ్యాండ్సమ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా మారి ఆ తర్వాత సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను అని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రాలేదు.
మరోవైపు రాజమౌళి తో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి అప్డేట్లు రాకపోయినప్పటికీ రాజమౌళితో సినిమా చేయడంపై ఎప్పటికప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అదృష్టం అంటే మహేష్ బాబుది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అదృష్టం అంతా రాజమౌళి తెచ్చి పెట్టిందే అని చెప్పవచ్చు.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
అంతేకాదు ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ ఇప్పుడు రాజమౌళి ఏ హీరోతో తన సినిమాని తెరకెక్కించబోతున్నాడు అని కేవలం పాన్ ఇండియా ప్రేక్షకులు మాత్రమే కాదు హాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తూ ఉండడంతో మహేష్ బాబు #SSMB 29 చిత్రంపై భారీ హైప్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఇదంతా కేవలం రాజమౌళి వల్లే సాధ్యమైంది అని వార్తలు వినిపిస్తున్నాయి ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని రూపొందించిన తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తారు అనేది ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. దీంతో సినిమా షూటింగ్ మొదలవ్వకముందే మహేష్ బాబు సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే మహేష్ బాబు కుంభస్థలం ఢీ కొట్టినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: