పవన్ ఆస్తులు లీక్ చేసిన నాగబాబు..!?

Anilkumar
ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికీ ఆయన పార్టీ పెట్టి దాదాపు 9 ఏళ్ళు గడుస్తోంది. ఇన్నేళ్లపాటు ఒక పార్టీని నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు. సాధారణంగా వేలకోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే రాజకీయాలలో రాణిస్తారు అని చాలామంది భావిస్తారు. అలాంటిది ఎటువంటి ఆస్తులు లేకుండా సమర్థవంతంగా అందులోనూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని వారి కష్టాలను తీరుస్తూ వారికి ఆర్థికంగా ఉండి పార్టీని నడపడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 

ఇందులో భాగంగానే జనసేన పార్టీని ఉద్దేశిస్తూ వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీని నడుపుతున్నారు అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఇక కేవలం పార్టీ నడపడం కోసమే ఆయన సినిమాలు చేస్తున్నాను అని చెప్పినప్పటికీ చాలామంది నమ్మలేదు. అయితే తాజాగా ఏ విషయంపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.. ఇక ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అని యాంకర్ అడిగింది..

దీనికిగాను నాగబాబు మాట్లాడుతూ.. ఏ సినిమా చేసిన ఆ వచ్చిన డబ్బుతో తను బ్రతకడం కోసం కొంత డబ్బును మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంచుకుంటాడు.. మిగిలిన డబ్బు మొత్తాన్ని కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తూ ఉంటాడు..అంతేకాదు ఆయన పార్టీ కోసం ప్రజల కోసం మిలటరీ వాళ్ళ కోసం వద్దు తుఫాన్లు వంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు విరాళాలు ఇస్తూ ఉంటాడు.. అంతేకాదు ఇండస్ట్రీకి ఎవరు సహాయం కోసం వచ్చినా కూడా తనకి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటాడూ పవన్ కళ్యాణ్.. అంతేకాదు తనకు చేతనైనంత వరకు డబ్బులను అందరికీ పంచుతూనే ఉంటారు.. అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఇప్పటివరకు తన దగ్గర ఏది ఉంచుకోలేదు అని.. ఇంకా పవన్ కళ్యాణ్ కి సినిమాలు తప్ప వేరే ఏ బిజినెస్ లో లేవని.. సినిమాల నుండి వచ్చే ఆదాయమే తప్ప ఆయనకి వ్యక్తిగతంగా వేరే ఎలాంటి వ్యాపారాలు లేవు అంటూ చెప్పవచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: