నేనింతే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
2008లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది సియా గౌతం.అయితే ఈమె అసలు పేరు అతిథి గౌతం. అసలు పేరు ఇది అయినప్పటికీ సియా గౌతమ్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో సంధ్య అనే పాత్రలో మరియు తన నటనతో ఎంతో మందిని మెప్పించింది ఈమె 

దాని అనంతరం ఈమె క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన వేదం సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఆమెకి పెద్దగా ఉపయోగపడలేదు అనే చెప్పాలి.ఈ సినిమాలతో ఆమెకి పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఈమెకి అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం లేదు. ఇక 2010లో వచ్చిన వేదం సినిమా తరువాత తెలుగు సినిమాలలో ఎక్కడా కూడా కనిపించలేదు ఈమె. దాని అనంతరం 2011లో ఒక కన్నడ సినిమాలో నటించింది ఈమె. దాని తరువాత దాదాపు ఏడేళ్ల తరువాత బాలీవుడ్ లో సంజు అనే సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది.

 అయితే ఈ సినిమా తర్వాత నుండి ఆమెకి అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. దీంతో అవకాశాలు రాకపోవడంతో తన సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో ఉంటుంది. తన అన్నయ్యకు సంబంధించిన బిజినెస్ లు చూసుకుంటూ బిజీగా ఉంది సియా. బిజినెస్ కాకుండా సినిమాల్లో ఆఫర్ల కోసం కూడా ప్రయత్నిస్తోంది.తాజాగా గతేడాది గోపిచంద్ నటించిన పక్క కమర్షియల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది ఈమె. అయితే ప్రస్తుతం ఈమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: