రొటీన్ సినిమాలు తీసి నష్టపోతున్న దిల్ రాజు?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి హాయిగా చూసి ఆనందించే సినిమా అనే అభిప్రాయం ఒకప్పుడు ప్రతి ప్రేక్షకుడిలో ఉంది. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ బంధాల చుట్టూ కథలని రిప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులకి అందిస్తూ ఉంటారు. దిల్ రాజు నిర్మాణంలో అలా వచ్చిన చాలా సినిమాలు కూడా అతనికి భారీగా లాభాలు తెచ్చిపెట్టి సూపర్ సక్సెస్ అందించాయి.బొమ్మరిల్లు,కొత్త బంగారు లోకం,బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,శతమానం భవతి ఇంకా ఫిదా లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో పాటు దిల్ రాజుకి చాలా డబ్బులు తెచ్చిపెట్టిన సినిమాలు. ఈ సినిమాలు అన్ని కూడా ఫ్యామిలీ అండ్ లవ్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కి జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 


అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు రొటీన్ మూవీస్ అయిపోయాయి.ఈ మధ్యకాలంలో దిల్ రాజు తీరుకి సోషల్ మీడియాలో అతడిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిర్మాతగా 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ఎఫ్2 మాత్రమే దిల్ రాజు బ్యానర్ లో ఓ f2, మహర్షి,సరిలేరు నీకెవ్వరూ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు.వకీల్ సాబ్ సినిమాకి హిట్ టాక్ వచ్చిన కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక మిగిలిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకా ప్రేక్షకులని మెప్పించలేదు. దీనికి కారణం రొటీన్ సినిమాలే.రీసెంట్ గా వచ్చిన వారసుడు సినిమా కూడా రొటీన్ సినిమా కావడంతో దిల్ రాజుని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా రీసెంట్ గా విడుదల అయిన వారసుడు సినిమా తమిళ తెలుగు భాషల్లో అంతగా ఆకట్టుకోలేక దిల్ రాజుకి మరో భారీ డిజాస్టర్ గా మారింది.మరి చూడాలి దిల్ రాజుకి మునుపటి రోజులు వస్తాయో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: