చిరంజీవి భోళా శంకర్ ఓటీటీ డేట్ లాక్..!

Divya
మెగాస్టార్ చిరంజీవి తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్ గా  నటిస్తోంది.  అంతేకాదు చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.  ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయడానికి గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ డేట్ లాక్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాదు ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  భోళా శంకర్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.  కానీ అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్టనర్ అప్పుడే ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజ ఫ్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ భోళా శంకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమయ్యింది.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు తమ ఓటీటీలోనే విడుదల కాబోతున్నాయని ప్రకటించిన నెట్ఫ్లిక్స్ మెగాస్టార్ భోళాశంకర్,  నాని దసరా పోస్టర్లను కూడా షేర్ చేసింది ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను  తెలుగుతోపాటు తమిళ్, కన్నడ,  మలయాళం భాషలో కూడా  స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.  ఏప్రిల్ 14న విడుదల అయ్యే ఈ భోళా శంకర్ సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది అని సమాచారం.
ఈ పోస్టర్ చూసిన చాలామంది భోళాశంకర్ డైరెక్ట్ ఓటీటీ లో వస్తుందేమోనని ఆశ్చర్యపోయారు.  అయితే అసలు విషయం తెలిసిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే అన్నా చెల్లెలు అనుబంధంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: