అక్కతో మహేష్ కూతురు డ్యాన్స్.. వైరల్?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టి తన తండ్రి లాగానే ఎంతో మంది పాలోవర్లను సంపాదించుకుంది.సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ ఫోటోస్ మాత్రమే కాకుండా.. స్నేహితులతో కలిసి చేసే అల్లరి ఇంకా వేకేషన్ టిప్స్ ఇలా అన్నింటిని షేర్ చేస్తుంటుంది. ఇంకా అలాగే.. తనకు నచ్చిన పాటలకు స్టెప్పులేస్తున్న వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇంకా అలాగే తన ముద్దు ముద్దు మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.సితార చాలా మల్టీటాలెంటెడ్ . డ్యాన్సింగ్ ,పెయింటింగ్ ఇంకా సింగింగ్..ఇలా అన్నింట్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో సితార ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా సితార షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.  ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కారణం ఎప్పుడూ కెమెరా ముందు కనిపించని రమేష్ బాబు కూతురు భారతి కూడా ఉండడం.మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గత సంవత్సరం కన్నుమూశారు. అయితే ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలు అంతగా బయటకు రావు.


ముఖ్యంగా ఆయన కూతురు ఇంకా కుమారుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండరు. ఇంకా అలాగే వారికి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ సమయంలో ఆయన కుటుంబం అంతా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో తమ బాబాయ్ మహేష్ బాబుతో కలిసి రమేష్ బాబు కూతురు ఇంకా కుమారుడు దిగిన ఫోటోస్ బాగా వైరలయ్యాయి. అందులో భారతి ఘట్టమనేని ఎంతో అందంగా ఇంకా క్యూట్ గా కనిపిస్తూ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మహేష్ భార్య నమ్రత షేర్ చేసిన ఓ ఫోటోలో కనిపించగా.. ఇప్పుడు సీతారతో కలిసి చాలా అందంగా డ్యాన్స్ చేసింది.సీతార షేర్ చేసిన ఆ డాన్స్ వీడియో విషయానికి వస్తే భారతి ఘట్టమనేని ఇంకా సితార ఘట్టమనేని ఇద్దరు కలిసి హాలీవుడ్ మ్యుజిక్‏కు స్టెప్పులేశారు. అందులో ఇద్దరూ కూడా ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా చాలా క్యూట్ గా చక్కగా డాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి ఇలా డాన్స్ చేయడం చూసేందుకు అసలు రెండు కళ్లు చాలవు. ఈ వీడియోకు చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: