పాపం.. అలాంటి వ్యాధి తో బాధపడుతున్న అనసూయ..!?

Anilkumar
ఈమధ్య ఈ యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది యాంకర్ అనసూయ. ఎప్పటికప్పుడు ఈమె ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది అనసూయ. ఇక తాజాగా తనను ట్రోల్స్ చేసే వారికి తన సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ కి తన సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పింది అనసూయ. ఇందులో భాగంగానే ఒక వీడియోలతో మాట్లాడుతూ.. మీ ట్రోల్స్ మీన్స్ నెగిటివ్ కామెంట్స్ నాకు ఎలాంటి ప్రభావం చూపవని ఒక వీడియో ద్వారా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ.

ఇక ఆ వీడియోలో.. నాకు ఓ డిసార్డర్ ఉంది అదేంటంటే నిజాలు చెప్పడం నెగటివ్ పీపుల్ ని అస్సలు లెక్క చేయకపోవడం అంటూ ఆ వీడియోలో పేర్కొంది అనసూయ. అంతేకాకుండా తనని ఎవరేమన్నా నేను అస్సలు పట్టించుకోను అని ఎప్పటికీ నిజాలు చెప్తాను అని జనాల ట్రోల్స్ ని కామెంట్స్ ని పట్టించుకునే పరిస్థితి లేదు అని ఒక షార్ట్ వీడియో ద్వారా తన సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని షేర్ చేసింది అనసూయ. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్స్ స్పందిస్తూ.. మీరు తిరిగి జబర్దస్త్ కి రావాలని తిరిగి యాంకరింగ్ కొనసాగించాలని జబర్దస్త్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అంటూ కామెంట్లను చేస్తున్నారు.  

యాంకరింగ్ ను పూర్తిగా మానేయడంతో అనసూయ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాలపై దృష్టి పెట్టడంతో యాంకరింగ్ ను మొత్తంగా మానేసింది. పక్క కమర్షియల్ గా ఆలోచిస్తూ ఎక్కువ డబ్బులు మరియు ఫేమ్ వచ్చే మార్గం వైపు దూసుకుపోతుంది అనసూయ. ఇక అనసూయ జబర్దస్త్ లో యాంకరింగ్ కొనసాగించే సమయంలో ఆమెకు నెలకి 10 లక్షల వరకు పారితోషకం ఇచ్చేవారు. సినిమాలకైతే అనసూయ ఒక కాల్ షీట్ కి సుమారు 3 లక్షలకు పైగానే తీసుకుంటుంది. అని తెలుస్తుంది. ఇక జబర్దస్త్ తర్వాత సినిమాలలో నటిస్తున్న కారణంగా ప్రస్తుతం అనసూయ సంపాదన నెలకి కోటి రూపాయలకు పైగానే ఉంటుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాదులో లగ్జరీ లైఫ్ ను కొనసాగిస్తోంది అనసూయ. ఖరీదైన కార్లు లగ్జరీ ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ తో ఎలాంటి కష్టం లేకుండా హాయిగా తన జీవితం ఎంజాయ్ చేస్తుంది అనసూయ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: