అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్..!?

Anilkumar
మెగా సపోర్ట్ తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా  కొనసాగుతున్నాడు. అయితే చాలామంది అల్లు అర్జున్ ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం మెగాస్టార్ అని చెప్తూ ఉంటారు. అల్లు అర్జున్ కి సంబంధించిన ఏ ఈవెంట్స్ లో నైనా చిరంజీవిని కానీ చిరంజీవి కుటుంబ సభ్యుల పేరు కానీ బన్నీ చెప్పాడు అని చాలామంది మెగా అభిమానులు ఆరోపిస్తూ ఉంటారు. అంతేకాదు ఏదో తన సొంత కష్టంతో ఈ స్థాయికి వచ్చినట్లు బిల్డప్లు ఇస్తూ ఉంటాడు అని బన్నీపై రకరకాల ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది.

అయితే గతంలో ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ తో ఏకంగా వారికి కూడా దిగారు. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ చిరంజీవి గొప్పతనాన్ని చాలాసార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఇష్యూ గురించి స్పందించాడు. మెగాస్టార్ ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ...

అల్లు అర్జున్ తనపై ఉన్న మెగా ట్యాగ్ ని తీసేయాలని భావిస్తున్నాడని.. ఇప్పటికైనా మీరు దీనిపై స్పందించాల్సి ఉంది అని జర్నలిస్ట్ అడగడం జరిగింది.. దీనికి సమాధానంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతిసారి తన గురించి కానీ తన మెగాస్టార్ గురించి కానీ చెప్పాల్సిన పనిలేదు. ఊరికే దాని గురించి ప్రస్తావిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది.. మొదట నేను మరియు పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలు అవ్వాలని భావించాము.. అలాగే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కూడా మంచి హీరోలు అవ్వాలి అని మేము కోరుకున్నాము.. అనుకున్న విధంగానే వాళ్ళు స్టార్ హీరోలు కావడంతో ప్రస్తుతం అందరం సంతోషంగా ఉన్నాము...పవన్ కళ్యాణ్ చరణ్ బన్నీ వీళ్లంతా నా చేయి పట్టుకొని పెద్దవారు అయినవారే ..అప్పుడు నడిచినట్లుగా ఇప్పుడు కూడా నా చెయ్యి పట్టుకొని నడవాల్సిన పనిలేదు.. అంటూ చాలా సపోర్టివ్ గా మాట్లాడాడు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: