హాట్ టాపిక్ గా మారిన కళ్యాణ్ రామ్ లుక్ !

Seetha Sailaja
నందమూరి కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి వచ్చి 20సంవత్సరాలు గడిచి తరువాత అతడి కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు. యంగ్ హీరోల హవా తో అతడి కెరియర్ అయిపోయింది అని అందరు భావించిన తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ‘బింబిసార’ తో భారీగా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఈమూవీ ఘన విజయం తరువాత కళ్యాణ్ రామ్ కు మార్కెట్ పెరిగి అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ అతడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల మధ్య అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమోగోస్’ మూవీకి సంబంధించిన ఫోటోలను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు సంబంధించి ఈమూవీ నిర్మాతలు విడుదల చేస్తున్న కళ్యాణ్ రామ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మనుషులను పోలిన మనుషులు ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన తొలి లుక్‌లో మోడర్న్ యువకుడిగా స్టైలిష్‌గా కనిపించిన కళ్యాణ్ రామ్ రెండో లుక్‌లో ఫార్మల్ డ్రెస్, కళ్లజోడుతో ఒక సగటు ఉద్యోగిలా కనిపించాడు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మూడో లుక్‌ లో అతన పూర్తి భిన్నమైన అవతారంలో కినపించాడు. గుబురు గడ్డం అందులో తెల్ల వెంట్రుకలు జులపాల జుట్టు చేతిలో గన్నుతో వయొలెంట్‌గా కనిపించిన కళ్యాణ్ రామ్ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.

తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీ కథ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండవచ్చు అన్న లీకులు వస్తున్నాయి.సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత ఫిబ్రవరి మొదటివారంలో ఈమూవీ విడుదల కాబోతోంది. ‘బింబిసార’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో ఈమూవీ బిజినెస్ బాగా జరిగింది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీకి పోటీగా విడుదలయ్యే చెప్పుకోతగ్గ సినిమా లేకపోవడంతో ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: