బన్నీ గురించి ప్రశ్న.. చిరంజీవి ఏమన్నారంటే?

praveen
మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు వారి వారసుడు అల్లు అర్జున్ ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ అనే ఇమేజ్ ని కూడా సంపాదించాడు. అయితే ఇక గత కొంతకాలం నుంచి మెగా అనే ట్యాగ్ నుంచి అతను బయటపడాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఏ సినిమా ఈవెంట్లో అయినా తన మామయ్యలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తే అల్లు అర్జున్ ఇటీవల వారి గురించి మాట్లాడటం మానేశాడు..

 అంతేకాదు ఇక అల్లు కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఇక మెగా కుటుంబం మాదిరిగానే అల్లు కుటుంబాన్ని కూడా మార్చాలని అనుకుంటున్నాడు. కాగా గత కొంతకాలం నుంచి ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మెగా ఫ్యామిలీకి మహావృక్షంలో కొనసాగుతున్న చిరంజీవికి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అభిమానులందరికీ ఫిదా చేసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అల్లు అర్జున్ అభిమానులను సైతం చిరంజీవి వ్యాఖ్యలు మంత్రముగ్ధులను చేశాయి.

 ప్రతిసారి కూడా తన గురించి మెగా ట్యాగ్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని.. దాన్ని ప్రతిసారి ప్రజల ముందుకు తెస్తే ఇరిటేషన్ వస్తుందని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. నేను పవన్ కళ్యాణ్ పెద్దవాడై మంచి హీరో అవ్వాలనుకున్నాను. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకున్నాను. ఇక ఇప్పుడూ వాళ్లంతా ఒక స్థాయికి చేరుకున్నారు. దీంతో వాళ్ళ సక్సెస్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ వరకు అందరూ కూడా నా చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు నేర్చుకున్నవారే.. ఇప్పుడు మారథాన్  రేస్ లో పరిగెడుతున్నారు. అలాంటివారిని మళ్లీ నా చేయి పట్టుకొని నడవమని చెప్పడం బాగుండదు.. నేను ఒక ప్రేక్షకుడిలా వాళ్ళ సక్సెస్ ని చూస్తూ మురిసిపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అంటే ఒకరకంగా బన్నీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: