"వీర సింహారెడ్డి" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచవ్యాప్తంగా క్లోజ్ చేసింది. మరి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.


ఈ మూవీ కి నైజాం ఏరియాలో 15 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ లో 13 కోట్లు ... యూఏ లో 9 కోట్లు ... ఈస్ట్ లో 5.2 కోట్లు ... వెస్ట్ లో 5 కోట్లు ... గుంటూరులో 6.40 కోట్లు ... కృష్ణ లో 5 కోట్లు ... నెల్లూరు లో 2.7 కోట్లు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


కర్ణాటక లో ఈ మూవీ కి 4.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి ... ఓవర్సీస్ లో 6.2  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దగబోతుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 74 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ లో ... దునియా విజయ్ విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: