జబర్దస్త్ రైజింగ్ రాజుకి అన్యాయం చేసిన హైపర్ అది..!?

Anilkumar
గత కొన్ని ఏళ్ళుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమై ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ షో ప్రారంభమైన సమయంలో వచ్చిన టీమ్స్ లో కేవలం ఇప్పుడు రాఘవ టీం మాత్రమే ఉంది.ఆయన మినహా అన్ని టీమ్స్ కూడా కొత్తగా వచ్చాయి. కొత్త టీం లీడర్స్ గా కూడా కొత్త వారే రావడం జరిగింది. అయితే ఈ షో ఆరంభంలో రైజింగ్ రాజు జబర్దస్త్ లో సందడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం రైజింగ్ రాజుని మరియు అదిరే అభి టీం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆదిని ఇద్దరినీ కలిపి హైపర్ ఆది మరియు రైసింగ్ రాజు అని టీం ను ఏర్పాటు చేశారు. 

అయితే ఈ టీం కి ఇద్దరు టీం లీడర్స్ ఉన్నప్పటికీ టీం బాధ్యత మొత్తం కూడా ఆదినే  తీసుకున్నాడు. రైజింగ్ రాజు పెద్దగా ఏమి చేయకపోయినప్పటికీ హైపర్ ఆది తన మంచితనంతో రైసింగ్ రాజుకి మంచి పారితోషకాన్ని ఇచ్చాడు.అయితే గతంలో హైపర్ ఆది కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ ను మానేశాడు. ఇక ఆ సమయంలో రైజింగ్ రాజు టీం బాధ్యతను తీసుకున్నాడు. ఇక తిరిగి ఆది జబర్దస్త్ కి రియంట్రి ఇవ్వడం అనంతరం మళ్లీ హైపర్ ఆది రైజింగ్ రాజు టీం గానే కొనసాగింది. అయితే ఆది జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడు. అయితే గత కొన్ని రోజులుగా...

ఈసారి నిజంగానే హైపర్ ఆది పర్మినెంట్గా జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆది వెళ్ళిపోయినప్పుడు రైజింగ్ రాజు కి టీం బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఈసారి మాత్రం అలా చేయలేదు. ప్రస్తుతం జబర్దస్త్ లో రైసింగ్ రాజు లేడు ఎక్కడో ఒక మూలన చిన్న చిన్న గెటప్ లు వేస్తూ జబర్దస్త్ లో కనిపిస్తున్నాడు. ముందు ముందు అసలు రైజింగ్ రాజు కనబడడేమో అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే హైపర్ ఆది స్కిట్స్ తో ఎంతో మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ రైజింగ్ రాజుకి మాత్రం ఈయన స్కిట్ ల వల్ల ఎలాంటి క్రేజ్ రాలేదు. ప్రస్తుతం రైజింగ్ రాజు ఇటు జబర్దస్త్ లోను మరియు సినిమాల్లోనూ కనిపించడం లేదు. ఆయనకి అవకాశాలు తగ్గాయని దానికి కారణం ఆయన వయస్సు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: