ఆ యూట్యూబర్ ని పెళ్లి చేసుకోబోతున్న ఆషూ రెడ్డి..?

Anilkumar
టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ జూనియర్ సమంత లాగా తనకంటూ  ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అషు రెడ్డి. అయితే గతంలో ఈమె వీడియోలు చేయడం చూసి చాలామంది అచ్చం  సమంత అలాగే ఉంది అంటూ కామెంట్లు సైతం చేస్తూ ఉండేవారు. ఇక అదే అషు రెడ్డికి ప్లస్ అయ్యింది. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ని తెచ్చుకుని దాని అనంతరం బిగ్ బాస్ షోలో కూడా వచ్చే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. ఈ షో తో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. షో నుండి బయటకు వచ్చి అనంతరం వరుస ఆఫర్లు అషు రెడ్డికి వచ్చాయి.

 అంతేకాదు కొన్ని షోలకి యాంకర్ గా కూడా వ్యవహరించింది ఈమె. దాంతోపాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఇలా ఈమెకి వరుస ఆఫర్లు రావడంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలోనే డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన ఇంటర్వ్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ చివరలో ఆశివరెడ్డి కాలిని  నోట్లో పెట్టుకోవడంతో ఒకసారిగా ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. ఇక ఈ విషయంలో ఈమెని చాలామంది చాలా విధాలుగా ట్రోల్స్ చేశారు .

అంతేకాదు చాలామంది విమర్శించారు కూడా. ఇక వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకోలేదు ఈమె. దీంతో ఈమెకి ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత బాగుంటుంది అని ఆమె తల్లి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తల్లి ఆమెకి పెళ్లి సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టింది అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈమె తో కలిసి షార్ట్ ఫిలిమ్స్ లో నటించే ఒక యూట్యూబర్ కి ఇచ్చి అషు కి పెళ్లి చేయాలని తన తల్లి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆశిర్ రెడ్డి తల్లికి కూడా ఆ యూట్యూబర్ అంటే చాలా ఇష్టం అట. పెళ్లి చేస్తే ఇవన్నీ మానేసి బుద్ధిగా కాపురం చేసుకుంటుంది అన్న ఆలోచనతో అషు రెడ్డి తల్లి  ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: