రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటికే తాను నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లతో తమిళ నాట స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  అజిత్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా అజిత్ "వలిమై" అనే మూవీ తో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ తమిళ స్టార్ హీరో తునివు మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకోక  తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తమిళ మరియు తెలుగు భాషలలో జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అజిత్ కు మంచి మార్కెట్ ఉండడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెగింపు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: