ఫ్రీ సేల్స్ తోనే "యూఎస్ఏ" లో అన్ని కలెక్షన్లను సాధించిన "వాల్తేరు వీరయ్య" మూవీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తూ వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా చిరంజీవి పోయిన చిరంజీవి ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు .

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో అతి ముఖ్యమైన కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్ర సెకండ్ ఆఫ్ లో రాబోతున్నట్లు తాజాగా చిరంజీవి వెల్లడించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను యూఎస్ఏ లో జనవరి 12 వ తేదీనే ప్రీమియర్ షో లు వేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను కూడా చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అందుబాటులో ఉంచింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ సేల్స్ 350 కే జరిగినట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: