కిరాక్ ఆర్పి కొత్త ఐడియా.. లేడీ చెఫ్స్ తో తిరిగి ప్రారంభం?

praveen
జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. అయితే గతంలోకమెడియన్ గా వార్తల్లో నిలిచిన కిర్రాక్ ఆర్పీ ఇటీవల తన వ్యాపారం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ ఏ కామెడీ షో లో కూడా కనిపించడం లేదు కిర్రాక్ ఆర్పి. అయితే ఇక కొత్తగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఒక కర్రీ పాయింట్  ను ప్రారంభించాడు.

 అయితే కిరాక్ ఆర్పి ఊహించిన దానికంటే తన కర్రీ పాయింట్  బాగా పాపులర్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కువ స్థాయిలో కస్టమర్ల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే జనాలు ఎక్కువగా పోటేత్తుతున్నారని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి అని భావించి ఇక తన ఫుడ్ బిజినెస్ను మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ఇక సరికొత్తగా మరికొన్ని రోజుల్లో ప్రారంభిస్తారని ప్రకటించాడు. అయితే డిమాండ్కు తగ్గట్లుగానే సప్లై ఉండాలి అన్న ఆలోచనతో నెల్లూరుకు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు కిర్రాక్ ఆర్పి.

 ఈ క్రమంలోని రుచికరంగా చేపల పులుసు వండిన కొందరు మహిళలను హైదరాబాద్ తీసుకువచ్చి తిరిగి కర్రీ పాయింట్ను ప్రారంభించాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇటీవల డబ్బు చప్పుళ్ల మధ్య కేక్ కట్ చేసి మరి ఘనంగా ఈ కర్రీ పాయింట్ను ప్రారంభించాడు. ఇక నెల్లూరు నుంచి తీసుకువచ్చిన మహిళలను తన ఇంట్లోనే నివాసం కల్పించి ఇక వారికి ఉద్యోగాలు కూడా ఇచ్చాడట. ఇలా మహిళా చెఫ్స్ అందరూ కూడా 4 గంటలకే నిద్ర లేచి ఇక వంటలు చేయడం మొదలు పెడతారట. ఇప్పుడు కూడా తన కర్రీ పాయింట్కు ఎక్కువ సంఖ్యలోనే జనాలు వస్తున్నారని కిర్రాక్ ఆర్పి చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: