హాట్ న్యూస్ గా మారిన సమంత జపమాల !

Seetha Sailaja

‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడిన సమంత కెరియర్ అయిపోయిందా అంటూ అనేక గాసిప్పులు వచ్చాయి. దీనికితోడు ఆమె గత కొన్ని నెలలుగా మీడియాకు కానీ అదేవిధంగా సోషల్ మీడియాకు కానీ అందుబాటులో లేకపోవడంతో అనేక ఊహాగానాలు ఆమె ఆరోగ్య పరిస్థితి పై హడావిడి చేసాయి.
 
 ఈ వార్తలకు చెక్ పెడుతూ నిన్న జరిగిన ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు ఆమె రావడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ మీడియా వర్గాలతో ఆమె మాట్లాడటమే కాకుండా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానాలు ఇచ్చింది. అయితే ఈమీడియా సమావేశం జరుగుతున్నంతసేపు ఆమె కుడిచేతిలోని జపమాలను పట్టుకుని మాట్లాడింది.
 
 
అంతేకాదు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ సూచనతో ఒక మంత్రాన్ని రోజుకు 10,008 సార్లు చాల నిష్టగా తాను ఆ మంత్రజపం చేయడంతో తాను త్వరగా కోలుకో గలిగానని చెపుతూ తనకోసం ప్రార్థనలు చేసిన ఎంతోమంది అభిమానుల ప్రార్థనా బలంతో తాను త్వరగా కోలుకున్న విషయాన్ని వివరించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మీడియా వర్గాలతో పాటు అనేకమంది సమంత అభిమానులు రావడమే కాకుండా ఆమెను చూడగానే అనేకమంది అభిమానులు ఈలలు వేస్తూ హడావిడి చేయడంతో ఆమె టాప్ హీరోయిన్ స్థానం ఎక్కడికి చెదిరిపోలేదు అన్న సంకేతాలు వచ్చాయి.
 
 దీనికితోడు నిన్న విడుదలైన ఈ ట్రైలర్ కు మంచి స్పందన రావడమే కాకుండా ఆ ట్రైలర్ లోని గ్రాఫిక్ వర్క్స్ బాగా ఉన్నాయి అని కామెంట్స్ వస్తూ ఉండటంతో ఈమూవీ పై అంచనాలు ప్రారంభం అయ్యాయి. మహాకవి కాళిదాసు వ్రాసిన శాకుంతలం కావ్యానికి నేటితరం అభిరుచులకు అనుకునంగా అనేక మార్పులు చేసి గుణశేఖర్ ఈమూవీ కోసం భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడమే కాకుండా చాల రీసెర్చ్ కూడ చేసాడు. వచ్చేనెల పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీతో తిరిగి సమంత హవా ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: