సందేహాలకు చెక్ పెట్టబోతున్న సమంత !

Seetha Sailaja

గత కొన్ని నెలలుగా సమంత అనారోగ్యం పై అనేక వార్తలు వచ్చాయి. మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె ఇప్పట్లో ఇక సినిమా షూటింగ్ లకు రాలేకపోవచ్చు అంటూ అనేక ఊహాగానాలు కూడ వచ్చాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆమె లేటెస్ట్ గా ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో అందరికీ కనిపించడంతో నడుస్తూ వెళుతున్న ఆమె ఫోటోలు ఏకంగా జాతీయ మీడియాకు కూడ వైరల్ గా మారాయి.

ఈఫోటోల హడావిడి పూర్తి అయిన కొన్ని రోజులు కూడ గడవకుండానే సమంత ఈరోజు మీడియా ముందుకు రాబోతోంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత నటించిన ‘శాకుంతలం’ ట్రైలర్ ఈరోజు విడుదల కాబోతోంది. ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను గుణశేఖర్ చాల భారీగా చేయబోతున్నాడు. ఈ ఫంక్షన్ కు సమంత రావడమే కాకుండా మీడియా వారితో మాట్లాడబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

తన అనారోగ్య సమస్యలు గురించి మీడియా వర్గాలు అడిగే అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ పై భారీగా ఖర్చుపెట్టాడు. సమంత ఇమేజ్ ని నమ్ముకుని పాన్ ఇండియా మూవీగా ఈమూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా ఈమూవీని హిందీ తమిళ కన్నడ మళయాళ భాషలలో విడుదల చేయబోతున్నారు.

శకుంతల దుష్యంత్ ల కథ దేశంలోని అన్ని వర్గాలకు తెలిసిన కథ. దీనితో ఈ కథకు దేశంలోని అన్ని భాషల సినిమా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని గుణశేఖర్ అంచనా. అయితే ఈమూవీ అంతా సమంత ఇమేజ్ పై ఆధారపడి ఉంటుంది. ఆమె పూర్తిగా అనారోగ్యం నుండి తేరుకుంది అన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడితే కాని ఈమూవీ మార్కెటింగ్ కు ఏర్పడ్డ సమస్యలు తీరవు. ఒక హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాను దేశవ్యాప్తంగా మార్కెట్ చేయాలి అంటే అది అంత సులువైన పనికాదు. అద్నుకోసమే సమంత రంగంలోకి దిగుతోంది అనుకోవాలి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: