అప్పట్లో శంకర్ దాదా సినిమా.. ఇప్పట్లో వాల్తేర్ వీరయ్యేనా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించడమే కాకుండా పలు పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. స్వయంకృషి తోనే ఎదిగిన చిరంజీవి మెగాస్టార్గా ఎదిగి ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. ఇక చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా పర్వాలేదు అనిపించుకున్నారు. ఈ సంక్రాంతికి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే ఈ సినిమా ట్రైలర్ ని గడిచిన రెండు రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లో మాస్ డైలాగులతో పాటు రవితేజ, చిరంజీవి మధ్య జరిగే కొన్ని ఫన్నీ డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి గతంలో నటించిన శంకర్ దాదా సినిమా లో ఎన్ని కామెడీ డైలాగులు, ఎమోషన్స్ ఇలా అన్నిటిని కూడా ఈ చిత్రంలో చూపించడంతో బాగా ఆకట్టుకున్నది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అలాంటి సన్నివేశాలతో పాటు కెమికల్ గురించి పలు విషయాలు తెలియజేయడంలో  కూడా చిరంజీవి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నారని సమాచారం.

ఇక అప్పట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక డైరెక్టర్ బాబి కూడా చిరంజీవితో ఇందులో మాస్ డైలాగులు చెప్పించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఈ మాస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన తదితర పాత్రలలో ప్రకాష్ రాజ్ ,శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. ఇక బాలయ్యతో దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ చిత్రంతో పోటీ పడుతున్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: