కళ్యాణ్ రామ్ "ఏమిగోస్" టీజర్ విడుదల తేదీని ప్రకటించడం మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా మరియు మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి  అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా బింబిసారా మూవీ తో అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ఏమిగోస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఏమిగోస్ మూవీ యూనిటీ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను తాజాగా ప్రకటించింది.
 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను రేపు అనగా జనవరి 8 వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: