పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా జాబ్ మానేసిన అషు రెడ్డి..!?

Anilkumar
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులే కాదు చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం పడి చచ్చిపోతూ ఉంటారు. ఇక అందులోని బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమ అభిమానాన్ని బయట పెట్టింది ఈమె. ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక టాటూ ని కూడా వేయించుకుంది ఆశు. ఇక ఆ టాటూ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ కూడా చేసుకుంది. 

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ ని కలిసింది ఈమె. కలవడమే కాకుండా పవన్ తో  కొద్దిసేపు మాట్లాడింది కూడా. ఇక ఈ విషయాన్ని తన జీవితంలో మరిచిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకుంది ఈమె .అసలు విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ఫస్ట్ షో చూడడానికి ఈమె జాబ్ ని సైతం మానేసిందట అషు. ఈ విషయమై తన కుటుంబ సభ్యులు కూడా తనపై కోప్పడ్డారట.

జాబ్ పోయినప్పటికీ తాను ఏమాత్రం రిగ్రేట్ కాలేదని చెప్పుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భక్తురాలిని అవ్వడం ఆమెకి ఎంతో గర్వంగా ఉంది అంటూ తాజాగా ఒక పోస్టులో పేర్కొంది ఆషూ రెడ్డి. ఇక ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ పోస్టును చూసిన చాలా మంది పవన్ అభిమానులు నిజంగా మెయిల్ పంపావా..? డ్రాఫ్ట్ లోనే ఉంది కదా..? నువ్వు పెట్టిన ఈమెయిల్ కి రిప్లై ఏమి వచ్చింది..? అంటూ చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ పవన్ కోసం ఏకంగా ఆశు రెడ్డి తన జాబ్ నే మానేయడం ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈమె షేర్ చేసిన పోస్ట్ కొద్దిసేపటికి డిలీట్ కూడా చేసింది..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: